NTV Telugu Site icon

Thandel: ఏడు సముద్రాలు దాటడానికి వస్తున్న తండేల్!

Thandel

Thandel

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు, గుజరాత్ తీరానికి వెళ్లి పాకిస్తాన్ జలాల్లో ఎంటర్ అయ్యి అక్కడి నేవి చేతికి చిక్కారు. కొన్నాళ్ల జైలు శిక్ష అనంతరం కుటుంబ సభ్యుల పోరాటాలు ఫలించి వారు జైలు నుంచి విడుదలై ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు. ఇదే కథనం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మార్చి రాసుకున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. అదే మత్స్యకారుల ప్రాంతానికి చెందిన కార్తిక్ అనే రైటర్ ఈ కథను సిద్ధం చేయగా ఒక పూర్తిస్థాయి లవ్ స్టోరీ గా దాన్ని మలిచాడు చందూ మొండేటి.

Sankranthiki Vasthunnam: ఓటీటీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డ్

ఈ సినిమాని ఫిబ్రవరి 7వ తేదీన తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. బన్నీవాస నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పించిన ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ద్వారా మార్చి 7వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో ఏకకాలంలో స్ట్రీమింగ్ కాబోతోంది. నిజానికి ఈ చిత్రం విడుదలైన రెండో రోజు నుంచి సినిమాకి సంబంధించిన మంచి పైరసీ ప్రింట్ బయటకు వచ్చేసింది. దీంతో ఆ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద పడిందని చెప్పచ్చు. ఇప్పటికే సినిమా 100 కోట్లు కలెక్షన్స్ సాధించిందని సినిమా యూనిట్ ప్రకటించింది. ఒకవేళ ఆ క్వాలిటీ ప్రింట్ బయటకు రాకుండా ఉంటే మరిన్ని కలెక్షన్స్ రాబట్టి ఉండేదేమో.