Site icon NTV Telugu

Thandel : ఉక్కిరిబిక్కరవుతున్న తండేల్?

Thandel

Thandel

Thandel Maybe Pushed to Sankranthi: నాగచైతన్య తండేల్ సినిమా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చింది. కస్టడీ లాంటి సినిమా చేసిన తర్వాత నాగచైతన్య ఒక సాలిడ్ హిట్టు కొట్టాలని ప్రయత్నంలో భాగంగా కాస్త అవుట్ ఆఫ్ బాక్స్ ఉండే ఈ సబ్జెక్ట్ చేస్తున్నాడు. శ్రీకాకుళం నుంచి వెళ్లిన జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవీ, పోలీసులు చేతులకు చిక్కి కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించారు. వారిలో ఒక కుర్రాడి జీవిత కథను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అదే కుర్రాడు రాసిన కథను చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాని ముందుగా డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు ఆ డేట్ కి సినిమాని రిలీజ్ చేయడం కష్టమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి వర్క్ ఇంకా పూర్తికాలేదు.

Deputy CM Pawan Kalyan: ఏనుగుల వల్ల రైతు దుర్మరణం చెందటం బాధాకరం

డిసెంబర్ చివరి వరకు ఆ వర్క్ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతికి రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ 19వ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అలాగే మరికొన్ని సినిమాలు ఇప్పటికే కర్చీఫ్ లు వేసి పెట్టారు. ఇప్పుడు తండేల్ కూడా సంక్రాంతికి కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. గీత ఆర్ట్స్ నుంచి మరే సినిమా లేకపోవడంతో ఈ సినిమాని ఆ సమయానికి దించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో క్లారిటీ లేదు. అయితే ఒక రకంగా నాగచైతన్య అభిమానులు మాత్రం ఒత్తిడికి గురవుతున్నారు. తమ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవుతుందా? లేక సంక్రాంతికి వెళుతుందా అని నాగచైతన్య అభిమానులు సరైన సమాచారం కోసం ఎదురుచూస్తున్నాను.

Exit mobile version