Site icon NTV Telugu

Thandel: ప్రమాదంలో తండేల్ డైరెక్టర్ సహా సినిమాటోగ్రాఫర్.. ఏమైందంటే?

Chandoo Mondeti

Chandoo Mondeti

యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక అసలు సంగతి ఏమిటంటే తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాటోగ్రాఫర్ శ్యామ్‌దత్ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక అంశాలు కూడా షేర్ చేసుకున్నారు.

Deva: యాక్టర్లకు కూడా తెలియకుండా సినిమాకు మల్టిపుల్ క్లైమాక్స్ లు

సినిమా షూటింగ్ లొకేషన్స్ రెక్కీ కోసం వెళ్ళినప్పుడు సముద్రంలో ఒక చిన్నపాటి ప్రమాదం జరిగినట్లు ఆయన వెల్లడించారు. తాను డైరెక్టర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సహా కొంతమంది కో డైరెక్టర్లు ఒక పడవలో లోపలికి వెళ్ళామని, అలా లోపలికి వెళ్ళిన సమయంలో పడవ ఒక రాతికి గుద్దుకుందని అన్నారు. అలా గుద్దుకోవడం వల్ల పడవకు రంధ్రం ఏర్పడి నీళ్లు లోపలికి రావడం, పడవ ఒక పక్కకి ఒరిగిపోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. మేము నిస్సహాయ స్థితిలో చేతులు ఊపుతూ సహాయం చేయమని అడిగితే దూరంగా వెళుతున్న పడవల్లోని వాళ్ళు వీళ్ళు తాగేసి హాయ్ చెబుతున్నారు అనుకోని వెళ్లిపోయారని ఆయన అన్నారు. చివరికి ఒక పడవ వారు వచ్చి పడవను లాక్కుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాలేదని చివరికి మమ్మల్ని ఆ పడవలోకి ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.

Exit mobile version