NTV Telugu Site icon

Thandel Bujji Thalli: గుండెలను పిండేస్తోన్న బుజ్జి తల్లి

Bujji Thalli Lyrical

Bujji Thalli Lyrical

యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ మ్యూజికల్ ప్రమోషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీస్ ని తీయడంలో మాస్టర్ అయిన చందూ మొండేటి దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ మూవీలోని ఈ సాంగ్ లీడ్ పెయిర్ ఎమోషనల్ జర్నీని అందంగా ప్రజెంట్ చేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్ మ్యాజికల్ గా వుంది. ప్లజెంట్ మెలోడీలను క్రియేట్ చేయడంలో మాస్టర్ అయిన దేవి శ్రీ ప్రసాద్ మెస్మరైజింగ్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. ఇది లిజనర్స్ మనసులో నిలిచి పోయేలా వుంది. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. లిరికల్ వీడియో ద్వారా లీడ్ పెయిర్ బాండింగ్ అద్భుతంగా చూపించారు. శ్రీ మణి రాసిన లిరిక్స్, తన ప్రేమికురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్న హీరో భావోద్వేగాలకు కవితాత్మకంగా ప్రజెంట్ చేశాయి.

Posani Krishna Murali: రాజకీయాలకు పోసాని కృష్ణమురళి గుడ్ బై

జావేద్ అలీ సోల్ ఫుల్ వోకల్స్ ట్రాక్‌ కు మరింత డెప్త్ ని యాడ్ చేశాయి. లిరికల్ వీడియో లీడ్ రోల్స్ జర్నీని, వారి ప్రేమకథను విజువల్ గా అద్భుతంగా ప్రజెంట్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి స్క్రీన్ పై ప్లజెంట్ కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. వారి నేచురల్ బాండింగ్, ఆన్-స్క్రీన్ పెయిరింగ్ ప్రత్యేకంగా నిలిచాయి. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల స్ఫూర్తితో రూపొందింది. ఈ మూవీకి షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. ఆర్ట్ విభాగానికి శ్రీ నాగేంద్ర తంగాల నేతృత్వం వహిస్తున్నారు. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

Show comments