NTV Telugu Site icon

Thandel : అక్కినేని అభిమానులు ఆవేదన.. వినేదెవరు..?

Thandel

Thandel

నాగ చైత‌న్య లేటెస్ట్ చిత్రం తండేల్‌. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. ల‌వ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయమై ఈ రోజు మధ్యాహ్నం 3: 00 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు మేకర్స్.

Also Read : KA : దివ్యాంగుల కోసం ‘క’ స్పెషల్ షో..

కాగా తండేల్ సినిమాను ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి రిలీజ్ డేట్ పట్ల అక్కినేని అభిమానులు తీవ్ర అసంతృప్తి గా ఉన్నారు. తమకు ఆ డేట్ వద్దంటే వద్దు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైన ఫ్యాన్స్ ఎలాంటి కష్టాలు పడుతున్నారో మీకు తెలియదు. తండేల్ ని ఫిబ్రవరి మొదటి వారం (సంక్రాంతి పండగ లేకుండా) రిలీజ్ చేయడం ఏ మాత్రం సరికాదు. ఎలాంటి సెలవులు లేని టైంలో ఎలా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు? ఉప్పెన, టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి లో వచ్చి హిట్ కొట్టిన వాటి పరిస్థితులు వేరు, తండేల్ పరిస్థితి వేరు. ఎంతో కష్టపడి నాగ చైతన్య చేస్తున్న ఈ సినిమాపైనే మా ఆశలన్నీ. మీరు ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తే, మా ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయడమేనని సోషల్ మీడియాలో వెలిబుచ్చుతున్న అక్కినేని ఫ్యాన్స్ భాద వినేదెవరు.

 

Show comments