NTV Telugu Site icon

Game Changer : శంకర్ మార్క్ ఫిల్మ్ గా ‘గేమ్ చేంజర్’.. థమన్ కామెంట్స్ వైరల్..

Thaman

Thaman

Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి కీలక పాత్రలో నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం రాంచరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read Also :NTR 31 : ఎన్టీఆర్ కు జోడిగా నేషనల్ క్రష్..క్రేజీ కాంబో ఫిక్స్..?

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉండటంతో ఆలస్యం అవుతూ వచ్చింది.శంకర్ తాను తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా జులై 12 గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీనితో శంకర్ తన పూర్తి ఫోకస్ గేమ్ చేంజర్ మూవీ పై ఉంచారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండిజరగండి ‘ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది.అయితే తాజాగా ఈ సినిమాపై థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .ఈ సినిమా శంకర్ మార్క్ ఫిల్మ్ గా తెరకెక్కుతోందని ఆయన కామెంట్ చేశారు.థమన్ కామెంట్స్ కు రాంచరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.