NTV Telugu Site icon

The GOAT Trailer : విజయ్ ‘గోట్’ ట్రైలర్ వచ్చేసింది.. చూశారా?

The Goat Trailer

The Goat Trailer

Thalapathy Vijay The GOAT Trailer Released: దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా వచ్చే నెల 5న రిలీజ్ కానున్న క్రమంలో ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేశారు మేకర్స్. ఇక తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తే విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు అర్ధం అవుతోంది. విజయ్ ఒక స్పైగా కనిపిస్తూ ఉండగా, తండ్రితో కలిసి కూడా ఫైట్స్ చేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు.

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చూసి సుకుమార్ ఫోన్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ : దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంటర్వ్యూ

ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగిబాబు, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది.

Show comments