Site icon NTV Telugu

‘వాలిమై’ దర్శకుడితో అజిత్ 61వ చిత్రం

Thala Ajith Kumar to do his next with Director H Vinoth

కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్ కుమార్ అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ వచ్చింది. అజిత్ మరోసారి ‘వాలిమై’ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ 61వ చిత్రం రూపొందబోతోంది. ఇంతముందే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన నెర్కొండ పార్వై, వాలిమై చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అజిత్, వినోద్ కాంబినేషన్ లో రాబోతున్న మూడవ చిత్రమిది. దర్శకుడు హెచ్ వినోద్ కు అజిత్ తో కలిసి బ్యాక్ టు బ్యాక్ మూడు చిత్రాలకు దర్శకత్వం వహించే అద్భుతమైన అవకాశం లభించింది. గతంలో దర్శకుడు సిరుతై శివకు ఈ అరుదైన అవకాశం లభించింది. వీరం, వేదం, వివేగం, విశ్వం అనే నాలుగు చిత్రాలకు అజిత్, శివ కలిసి పని చేశారు. ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాయి. వివేగం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

Exit mobile version