NTV Telugu Site icon

సీఎం రిలీఫ్ ఫండ్ కు అజిత్ భారీ విరాళం

Thala Ajith Kumar donated 25 Lakhs to the TNCM Relief fund

కోవిడ్ -19తో పోరాటానికి కోలీవుడ్ మొత్తం ఏకం అవుతోంది. తాజాగా తల అజిత్ తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల భారీ విరాళం ఇచ్చారు. అజిత్ కుమార్ నేరుగా బ్యాంకు బదిలీ ద్వారా 25 లక్షలను సిఎం రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేశారు. ఇంకా సూపర్ స్టార్ రజినీకాంత్ రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇక ఇప్పటికే సూర్య, ఎఆర్ మురుగదాస్, ఉదయనిధితో సహా పలువురు తారలు కోవిడ్ సహాయక చర్యల కోసం తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలను ఇచ్చారు. సూర్య, ఎఆర్ మురుగదాస్, ఉదయనిధి… సిఎం ఎంకె స్టాలిన్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని చెక్కులను అందజేశారు. ఇతర కోలీవుడ్ ప్రముఖులు కూడా తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వబోతున్నారు. కరోనా రెండవ వేవ్ వ్యాప్తిని నియంత్రించడానికి సిఎం ఎంకె స్టాలిన్ తమిళనాడులో పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే.