సాధారణంగా నిర్మాతలు తమ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోరు కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాత్రం అందుకు భిన్నం. ఆయన పలు ఇంటర్వ్యూలలో తన గత సినిమాల గురించి ఎన్నో సార్లు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి హార్ట్ టాపిక్ అయ్యారు. నిజానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక నిర్మాణ సంస్థను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంస్థలు నడుపుతున్న టీజీ విశ్వప్రసాద్ ప్రారంభించారు. తెలుగులో 100 సినిమాలు నిర్మించడమే తమ ధ్యేయంగా రంగంలోకి దిగిన ఈ సంస్థ ఒక ఫ్యాక్టరీ మోడల్ లో రన్ అవుతుంది. గతంలో ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి కొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి.
Akhil Next: విశ్వంభర ఎఫెక్ట్.. అఖిల్ సినిమా ఇంకా ఆలస్యం?
కానీ 2024 లో మాత్రం ఈ సంస్థ నుంచి అన్ని సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, శర్వానంద్ మనమే అలాగే మరో నిర్మాతతో కలిసి చేసిన విశ్వం సినిమాలు ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన టీజీ విశ్వప్రసాద్ 2024 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఒక బ్యాడ్ ఇయర్ అని అభివర్ణించారు. దాదాపుగా ఈ సినిమాల వల్ల 100 కోట్ల వరకు నష్టపోయినట్లు ఆయన ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు ఏవి లాంచ్ చేయడం లేదని వచ్చే ఏడాది కం బ్యాక్ ఇస్తామని చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ టన్నులు కొద్ది ఉన్న విశ్వప్రసాద్ తాము ఖచ్చితంగా కం బ్యాక్ ఇస్తామని అంటున్నారు. ప్రస్తుతానికి విశ్వప్రసాద్ నిర్మాతగా ప్రభాస్ రాజా సాబ్, అడవి శేషు గూడచారి 2, తేజ సజ్జా మిరాయ్ సినిమాలతో పాటు సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రాలు వచ్చే ఏడాది వరుసగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.