ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ అనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్లు సాధ్యమైనంత త్వరగా వివాహాలు చేసుకుంటారు. వీరి ఆలోచనా తీరులో మార్పు చోటుచేసుకుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సెలబ్రెటిలు అందులో ముఖ్యంగా హీరోయిన్‌లు పెళ్లి చేసుకుంటే, సినీ కెరీర్ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో, చాలా ఏళ్లకు పెళ్లి చేసుకునేవారు. కానీ ఈ తరం హీరోయిన్‌లు మాత్రం వెంటవెంటనే వివాహాలు చేసుకుంటున్నారు. కొందరు హీరో, హీరోయిన్ లు అయితే ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా దక్షిణాది యంగ్ బ్యూటీ అయిన పార్వతి నాయర్ కూడా అదే చేసింది..
Also Read:Rinku Rajguru: తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టిన స్టార్ హీరోయిన్..!
పార్వతి నాయర్ గురించి పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని తో ‘జెండాపై కపిరాజు’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తమిళం, మళయాళ భాషల్లో కలిపి మొత్తం 30కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజాగా పార్వతి నాయర్, బడా బిజినెస్ మాగ్నెట్ అయిన అశ్రిత్ తో కొంతకాలం నుంచి ప్రేమలో ఉంది. ఇక పెద్దలను ఒప్పించి ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట.. పెద్దల సమక్షంలో తాజాగా మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పార్వతి ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు నెటిజన్లు అంతా ఈ కొత్త జంటకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.