మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ హీరోగా నటించిన చిత్రం ‘జయ జయ జయ జయహే’. విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కేవలం రూ. 6కోట్లతో నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేటర్స లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటిటీలోను విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను పలుభాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పడు తెలుగు రీమేక్ కు సంబంధించి ప్రకటన చేసారు మేకర్స్.
Also Read : WAR 2 : ఇట్స్ అఫీషియల్.. వార్ 2 తెలుగు రిలీజ్ నాగవంశీ
తెలుగులో ఈ సినిమాను ‘ఓం శాంతి శాంతి శాంతిః’ పేరుతో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు కమ్ హీరో తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోంది. సంజీవ్ ఏఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాను 2024లోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఏమైందో అప్డేట్ లేదు. తన హక్కులను కాపాడుకునేందుకు ఒక సాధారణ మహిళ తన భర్త, అత్తలను ఎలా ధైర్యంగా ఎదుర్కొంది అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్. 35 చిన్న కథ కాదు మేకర్స్ ఈ సినిమాను తెలుగులో నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. ఈ ఆగస్టు 1న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాను వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ చూసేసిన ఈ హిట్ సినిమా రీమేక్ రూపంలో ఏ మేరకు హిట్ కొడుతుందో.
