Site icon NTV Telugu

పవన్, రానా మూవీ షూటింగ్ రీస్టార్ట్… ఎప్పుడంటే?

Telugu remake of 'Ayyappanum Koshiyum' will resume shoot from July 12.

మలయాళ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ మల్టీస్టారర్ లో పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న ప్రారంభం కానుంది.

Read Also : అందాల విందుతో కవ్విస్తున్న మౌనిరాయ్

ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్ జూలై 11న ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. కానీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు మేకర్స్ జూలై 12న సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. నిత్యామీనన్ కూడా సినిమా సెట్లో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ లోనే పవన్ పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట. పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.

Exit mobile version