NTV Telugu Site icon

మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు హీరోయిన్

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ విషయంలోనూ ఈషా ఏమాత్రం తగ్గకుండా నటిస్తోంది. సోషల్ మీడియాలోనూ హాట్ నెస్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఆమె నటించిన ‘రాగల 24 గంటల్లో’ సినిమా ఈషాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘అరవింద సమేత’లో మెరిసిన ఈ బ్యూటీ, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమాలోను నటిస్తోంది. తాజాగా ఈషా మలయాళంలో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఈషా రెబ్బా నటిస్తోంది. ఫెల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.