Biopic: తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన గొప్ప రచయిత, ఆచార్యుడు, తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కీ. శే. విశ్వనాథ సత్యనారాయణ. వారి జీవిత చరిత్ర వెండితెరపై ‘కవిసమ్రాట్’ పేరుతో ఆవిష్కృతమైంది. విశ్వనాథ సత్యనారాయణగా ప్రముఖ నటులు ఎల్. బి. శ్రీరామ్ నటించారు. దీన్ని సవిత్ సి. చంద్ర తెరకెక్కించారు. విశ్వనాథ సత్యనారాయణ సోదరుడిగా అనంత్, తండ్రిగా ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి నటించారు. ఈ చిత్రానికి జోశ్యభట్ల సంగీతం అందించారు.
Read also: Vikarabad Students: ఎమ్మెల్యే సార్ పట్టించుకోండి.. రోడ్డుకోసం రోడ్డెక్కిన విద్యార్థులు
తెలుగు సినీ అభిమానులతో ‘ఆహా’ అనిపించుకోవాలన్నదే తన కోరిక అని, ‘వేయి పడగలు’, ‘రామాయణ కల్పవృక్షం’ వంటి గొప్ప గ్రంధాలను రాసిన మహోన్నతులు విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్ర పోషించడం గర్వంగా ఉందని ఎల్బీ శ్రీరామ్ తెలిపారు. ఈ సినిమాను ఈ నెల 22న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
RRR In Japan: జపాన్‌లో RRR క్రేజ్.. అస్సలు తగ్గడం లేదుగా..
