NTV Telugu Site icon

Pushpa 2: పుష్ప 2 నిలిపివేయాలంటూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

Pushpa2

Pushpa2

పుష్ప 2 సినిమాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన పుష్ప 2 చిత్రం విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు శ్రీ శైలం అనే వ్యక్తి. సెన్సార్ బోర్డు తరపున వాదనలు వినిపించారు డిప్యూటీ సోలిసిటర్ జనరల్. ఈ సినిమా వీక్షించే మార్పులు సూచించిన ఆ తర్వాతే విడుదలకు అనుమతించామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది పేర్కొన్నారు.

Yogi Babu: అందం కాదు బాసూ టాలెంట్ ఉంటే హాలీవుడ్ అయినా సలాం కొట్టాల్సిందే!

ఊహాజనితం ఆధారంగా చిత్రం విడుదల నిలిపివేయలేమని హైకోర్టు పేర్కొంది. కోర్టు సమయం వృధా చేసినందుకు జరిమానా విధిస్తామని హై కోర్టు వెల్లడించింది. ఆ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు అందజేయాలని పిటిషనర్ ను ఆదేశించింది హై కోర్టు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Show comments