Site icon NTV Telugu

తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దు

తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే థియేటర్ల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారవుతుందని విన్నవించారు.

Exit mobile version