బిగ్ బాస్ హాట్ బ్యూటీ తేజస్వీ మదివాడకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే అన్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ కన్నా ముందు పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించడం మాత్రమే కాదు, సెకండ్ హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించలేదు కానీ బుల్లితెర పై పలు షోలల్లో సందడి చేస్తుంది.. బిగ్ బాస్ ఓటీటీ సందడి చేసి పాజిటివ్ టాక్ ను అందుకుంది..
అంతేకాదు బుల్లితెర పై డ్యాన్స్ షోలో కూడా మెరిసింది.. అలా తేజస్వీ కెరీర్ ఇప్పుడు కాస్త ప్రశాంతంగానే సాగుతున్నట్టుగా కనిపిస్తోంది.. సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆమె వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. సుమ కొడుకు రోషన్ కనకాలకు తేజస్వీ బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చింది.. అంతేకాదు బ్రదర్ మరో తల్లితో సమానం అంటూ పోస్ట్ చేసింది.. ఈ పోస్టును చూసిన వారంతా కూడా వీరిద్దరికి ఇంత రిలేషన్ ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు మొత్తానికి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.. రోషన్ ఇటీవల బబ్లూగమ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు..