NTV Telugu Site icon

‘విరాట పర్వం’ : ఉగాది స్పెషల్ గా సాయి పల్లవి న్యూ పోస్టర్

Team Virata Parvam wishes you all a very Happy Ugadi

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. ‘రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుతూ సాయి పల్లవి పిక్ ను విడుదల చేశారు. తెలుగుతనం ఉట్టిపడుతున్న ఈ పిక్ లో సాయి పల్లవి లుక్ అద్భుతంగా ఉంది. సాధారణ అమ్మాయి లుక్ లో గడపకు బొట్లు పెడుతూ ఉన్న సాయి పల్లవిని చూస్తుంటే పక్కింటి అమ్మాయిలా కన్పిస్తోంది. ఈ పిక్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ‘శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ‘విరాటపర్వం’ టీం ప్రేక్షకులను విష్ చేసింది. కాగా 1990నాటి విప్లవ కథలోని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి ‘భారతక్క’ అనే పాత్రలో కనిపించనుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాట పర్వం’ చిత్రాన్ని సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్, పోస్ట‌ర్లు, టీజర్ ఆకట్టుకోగా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదల కానుంది.