Site icon NTV Telugu

Chiranjeevi with Venkatesh: మెగాస్టార్ తో విక్టరీ వెంకటేష్.. భలే ఫ్రేమ్ బాసూ

Venkatesh Chiranjeevi

Venkatesh Chiranjeevi

Team #VenkyAnil3 met Chiranjeevi : టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కలిశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. Venkatesh Chiranjeeviమరోపక్క విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి విక్టరీ వెంకటేష్ 3 అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ జరుగుతున్న సందర్భంగా వెంకటేష్ విశ్వంభర సెట్ కి తన టీం తో కలిసి సందర్శించారు. ఇక ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Appudo Ippudo Eppudo: ఆసక్తికరంగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజ‌ర్

ఇక మెగాస్టార్ చిరంజీవి యువీ క్రియేషన్స్ లో డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా సిస్టర్ సెంటిమెంట్ తో పాటు సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఇక ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా చిరంజీవికి చెల్లెలుగా అయిదుగురు భామలు నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విశ్వంభర టైటిల్ గ్లింప్స్, చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా విశ్వంభర సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. విశ్వంభర సినిమా టీజర్ రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రకటనతో పాటు చిరంజీవి కత్తి పట్టుకుని ఉన్న అదిరిపోయే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రేపు దసరా సందర్భంగా ఉదయం 10:49 గంటలకు విశ్వంభర టీజర్ రిలీజ్ చేయనున్నారని ప్రకటించారు.

Exit mobile version