Site icon NTV Telugu

“రామారావు” కోసం ఆన్ డ్యూటీలో మరో హీరో

Team Rama Rao On Duty welcoming back Venu Thottempudi

మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రంగా “రామారావు ఆన్ డ్యూటీ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను పంచుకున్నారు. ‘రామారావు’ కోసం మరో హీరో డ్యూటీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ హీరో వేణు. గతంలో పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ డ్రామాల్లో నటించిన ఈ హీరో చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. “స్వయం వరం” వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో చింతకాయల రవి, దమ్ము సినిమాల్లో సహాయక పాత్రల్లో కన్పించాడు. ఆయన చివరిగా హీరోగా నటించిన చిత్రం “మాయగాడు”. 2012-13 తరువాత ఈ హీరో అసలు సిల్వర్ స్క్రీన్ పై కన్పించలేదు. తాజాగా రవితేజ సినిమాలతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తుండడం గమనార్హం. ఆయన పాత్ర సినిమాలో కీలకమని తెలుస్తోంది.

Read Also : నాని ఖాతాలో మరో మైలురాయి

కాగా శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిజ సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందుతున్న ప్రత్యేకమైన థ్రిల్లర్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘మజిలి’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. “రామారావు”లో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామ కృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

Exit mobile version