Site icon NTV Telugu

హీరోయిన్ కు “పెళ్లి సందD” టీం బర్త్ డే విషెస్

Team Pelli SandaD wishes SreeLeela a very Happy Birthday

అప్ కమింగ్ హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న “పెళ్లి సందD” టీం బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చిత్రబృందం మొత్తం ఉన్నారు. పోస్టర్ చూస్తుంటే అందరూ కలిసి ఒకేసారి శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఉంది. దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి రెండు సాంగ్స్ విడుదల కాగా… వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version