గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ NBK112. ఇప్పటికే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల నిలిచిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రూమర్లపై చిత్ర యూనిట్ “Team NBKKoratalaSiva” పేరుతో క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించిన ప్రచారాలను, అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుంది, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘NBK111’ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే ఈ కొరటాల శివ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రాంభం అవుతుందని’స్పష్టం చేసారు. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో మొకాలుకి సర్జరీ చేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యాక ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల.

