యంగ్ హీరో లక్ష్య్ నటిస్తున్న తాజా చిత్రం “గ్యాంగ్ స్టర్ గంగరాజు”. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ డైమన్షన్ క్యారెక్టర్ లో లక్ష్య్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో వేదిక దత్ ఈ హీరో సరసన రొమాన్స్ చేయనుంది. జనవరి 22న హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. కానీ ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు అదుపులోకి రావడం, లాక్ డౌన్ ను ఎత్తేయడంతో తాజాగా షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు చిత్రబృందం.
Read Also : అజిత్ అభిమానులా మజాకా… ట్రెండ్ సెట్ చేసేస్తున్నారుగా…!
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని సరికొత్త కథాంశంతో రూపొందిస్తున్నారు మేకర్స్. లక్ష్య్ ఇటీవల “వలయం” అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు “గ్యాంగ్ స్టార్ గంగరాజు” అనే క్యాచీ టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఈ ఎనర్జిటిక్ హీరో సిద్ధమవుతున్నాడు.
