NTV Telugu Site icon

డైరెక్టర్ మోహ‌న్ రాజాకు ‘చిరు153’ టీం బర్త్ డే విషెస్

Team #Chiru153 Wishing Director Jayam Mohanraja on His Birthday

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా తరువాత కూడా చిరు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండనున్నారు. ‘ఆచార్య’ త‌ర్వాత మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ‘లూసిఫ‌ర్’ రీమేక్‌.. మెహ‌ర్ ర‌మేశ్‌తో ‘వేదాళం’ రీమేక్ లైన్‌లో ఉన్నాయి. కాగా ఈరోజు దర్శకుడు మోహన్ రాజా పుట్టినరోజు. ఈ సందర్భంగా #చిరు153 టీం ఆయన శుభాకాంక్షలు తెలియజేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫ‌ర్’ రీమేక్‌ అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్‌ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. జూలై నుంచి ఈ పొలిటికల్ డ్రామా షూటింగ్ మొదలవుతుందట. ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రానికి “కింగ్ మేకర్” అనే టైటిల్ ను ఖరారు చేశారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం “లూసిఫర్” రీమేక్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరు రీమేక్‌లో కొన్ని మార్పులను సూచించారు. దర్శకుడు మోహన్ రాజా తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి సరిపోయే విధంగా స్క్రిప్ట్‌ను చక్కగా తీర్చిదిద్దారట. కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తగ్గి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక టైటిల్, ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.