NTV Telugu Site icon

Madhavilatha: మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

Madhavilatha

Madhavilatha

ఎక్కడైనా న్యూ ఇయర్ వేడుకలు ఎంజాయ్ మెంట్ తెస్తాయి.. లేదా ఒక జోష్ నింపుతాయి. కానీ అనంతపురంలో మాత్రం రాజకీయ దుమారాన్ని రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కేవలం మహిళల కోసమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించగా… దీనిపై బీజేపీ మహిళా నేతలు యామిని శర్మ, మాధవీలత(సినీ నటి) చేసిన విమర్శలు.. దానికి జేసి వర్గీయులు ఇచ్చిన కౌంటర్లు రాష్ట్రం లోనే పెద్ద దుమారాన్ని రేపాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి న్యూ ఇయర్, సంక్రాంతి, దసరా ఏదైనా సరే ఆయన తనదైన శైలిలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా నూతన సంవత్సర వేడుకలు తాడిపత్రిలో ఘనంగా నిర్వహించారు.

Tollywood: ప్రయోగాలొద్దమ్మా.. కమర్షియల్ సినిమాలే కావాలి!

అయితే ఇందుకు కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించి… జెసి పార్క్ లో వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఇటీవల తాడిపత్రి ప్రాంతంలో గంజాయి విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినీ నటి మాధవిలత, యామినీ శర్మలు ఈ ఈవెంట్ లో పాల్గొనవద్దని… అక్కడ మహిళలకు సేఫ్ కాదని సూచించారు. గంజాయి బ్యాచ్ ఏదైనా దాడులు చేస్తే దానికి బాధ్యులు ఎవరని వారు ప్రశ్నించారు. అయితే తాజాగా బీజేపీకి చెందిన వారంటూ మాధవి లత, యామినీ శర్మ చేసిన వ్యాఖ్యల మీద చాలా తీవ్రంగా స్పందించారు ప్రభాకర్ రెడ్డి. ఇదే సమయంలో బిజెపి మీద కూడా జెసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు.

Show comments