మన టాలీవుడ్ యూత్‌కి బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒక్కటి. విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సింపుల్ స్టోరీతో యూత్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఫుల్ ఎంటర్టైనింగ్‌గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ప్రారంభంలో ఆడియెన్స్‌కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ, మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట ఎంతో పాపులర్ అయ్యింది.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ రూపొందించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Toxic : ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేను
ఇక సీక్వెల్ కోసం ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ నెలకొనగా, తాజాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే బజ్ వినిపిస్తుంది. అయితే ఈ ఏడాది ఉగాదితో సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్‌గా ‘ఈ’ అంటూ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ వైరల్‌గా మారింది. ‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలె’ అంటూ ఈ నగరానికి ఏమైంది లో విశ్వక్ సేన్ సింబల్ నల్ల కళ్లద్దాలు పెట్టి పోస్ట్ చేశాడు. దీంతో ఈ సినిమా షూటింగ్ గురించి హింట్ ఇచ్చినప్పటికి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.