NTV Telugu Site icon

Tandel: ‘తండేల్’ జాతరలో స్టెప్పులు వేసిన నాగ చైతన్య , సాయి పల్లవి

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే పనులను పూర్తి చేసుకున్న ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దీంతో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 02) హైదరాబాద్‌ వేదికగా ‘తండేల్‌ జాతర’ పేరుతో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌నునిర్వహించారు.

ఈ ఈవెంట్ కి ముఖ్య అథిదులుగా నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా హాజరయ్యారు. కాగా పేరుకు తగ్గట్టుగానే తండేల్ జాతర ఈవెంట్ ఉల్లాస భరితంగా జరిగింది. అయితే అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ లో భాగం కావాల్సి ఉంది. కానీ హెల్త్ ప్రాబ్లం వలన తాను హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా సినిమాలోని హైలెస్సా.. హైలెస్సా, శివ శక్తి పాటలకు సాయి పల్లవి, నాగచైతన్య స్టేజిపై డాన్స్ వేసి అలరించారు. సినిమాల్లో తప్ప బయట పెద్దగా డ్యాన్సులు చేయని నాగ చైతన్యను అల్లు అరవింద్‌ చేయి పట్టుకొని స్టేజీ పైకి తీసుకొచ్చి మరీ డ్యాన్స్‌ చేయించడం విశేషం.

అంతేకాదు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సుమ తో కలిసి అల్లు అరవింద్ కూడా స్టెప్ లేసాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదంతా ఒక్కత్తే తే..ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా ఎవరికి తెలియని, చెప్పని ఒక సంఘటన పంచుకున్నారు.‘అర్జున్ రెడ్డి’ మూవీకి కి హీరోయిన్‌ని వెతుకుతున్న సమయంలో ముందుగా సాయి పల్లవి హీరోయిన్ గా అనుకున్న అని తెలిపారు. దీంతో సందీప్ మాటల సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇక సాయి పల్లవి మీరు కోట్లు ఆఫర్ చేసిన నటించేది కాదు అంటూ ఫ్యాన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.