తమిళ స్టార్ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. అందిన సమాచారం ప్రకారం.. మధురై నుంచి చెన్నైకి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాతుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు షాకింగ్ న్యూస్. దీంతో ఆయన స్నేహితులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. నటుడు శాంతు దర్శకుడితో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి, X వేదికగా ‘ప్రియమైన సోదర నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను, మీమల్ని ప్రతి క్షణం ఎల్లప్పుడూ ఆదరిస్తాను. చాలా త్వరగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని మిస్ అవుతున్న’ అంటూ తెలిపారు. అలాగే..
Also Read : Ileana : మళ్లీ రీఎంట్రీ ఇస్తా అంటున్న గోవా బ్యూటీ..
విక్రమ్ సుగుమారన్ మరణం గురించి తెలుసుకున్న నటుడు కాయల్ దేవరాజ్ దిగ్భ్రాంతికి గురయ్యారు.. ‘నేను నిజంగా ఈ వార్తను నమ్మలేకపోతున్నాను’ అని తెలిపారు. ఇక ‘మాదా యానై కూటం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విక్రమ్ సుగుమారన్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించాడు. ప్రజంట్ ‘థెరం పోరం’ అనే సినిమా కూడా చేస్తున్నారు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. లాస్ట్ టైమ్ ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోని కొంతమంది తనను మోసం చేశారని తెలిపారు. మరి ఈ గుండెపోటుకు ఆ ఆలోచనే కారణామా..?
