Site icon NTV Telugu

Rajasab : ‘రాజాసాబ్’ లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. మాస్ ఆడియెన్స్‌కు పండుగే !

Raja Saab Prabhas

Raja Saab Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎన్నో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆ లిస్టులో ‘ది రాజాసాబ్’ ఒకటి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ జానర్‌ చిత్రం పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై హైప్‌ పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Also Read :8 Vasanthalu OTT: ‘8 వసంతాలు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!

సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ పాట కోసం పలు టాప్ హీరోయిన్‌లను చిత్ర యూనిట్ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, చివరకు తమన్నాని ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్‌కి హాట్ ఫేవరెట్. బాలీవుడ్‌లో అయితే ప్రత్యేకంగా ఆమెను ఐటమ్ నంబర్‌లకు పిలిపించడం కామన్ అయిపోయింది. ఆమెకి ఉన్న డ్యాన్స్ టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటను హైలైట్‌గా నిలిపేలా చేస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ, ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం తమన్నా ఎంట్రీ కన్ఫర్మ్ అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సమాచారం నిజమైతే ‘ది రాజా సాబ్’ లో వచ్చే ఈ స్పెషల్ సాంగ్, సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవడం ఖాయం.

ఇక తమన్నా, ప్రభాస్‌తో ఇప్పటికే ‘రెబల్’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ లాంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరి కాంబో తెరపై కనపడతుందనే వార్త ఫ్యాన్స్‌ను ఎగ్జయిట్ చేస్తోంది. ఇది కేవలం స్పెషల్ సాంగ్ అయినా సరే, ప్రభాస్ – తమన్నా జోడీని మళ్లీ స్ర్కీన్ మీద చూడటం నిజంగా ప్రేక్షకులకు ఫుల్ ఫన్ ఇవ్వనుందని భావిస్తున్నారు.

Exit mobile version