మనం చూడాలే కానీ మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి. రాజు అనే అంధ యువకుడు హైదరాబద్ ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తూ శ్రీ ఆంజనేయం సినిమాలోని పాట పాడగా ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ MD సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ‘మనం చూడాలే కానీ.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో. ఈ అంధ యువకుడు అద్భుతంగా పాడారు కదా..ఒక అవకాశం ఇచ్చి చూడండి అని ఆస్కార్ విన్నర్ MM కీరవాణిని ట్యాగ్ చేసారు.
Also Read : Acteress Kasturi : కష్టాల సుడిలో కస్తూరి.. అరెస్ట్ కు రంగం సిద్ధం
రాజు టాలెంట్ ను గుర్తించి తనకి ఒక అవకాశం ఇవ్వండి అని నెటిజన్ తమన్ ను ఎక్స్ లో ట్యాగ్ చేసాడు. అందుకు బదులుగా తమన్ స్పందిస్తూ ” ఇండియన్ ఐడల్ సీజన్ 4లో రాజు తప్పకుండ పాడతాడు. ఆహా టీమ్ నా అభ్యర్థన మరియు నా ఆదేశాన్ని స్వీకరించండి. ఇండియన్ ఐడల్ లో రాజు ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది మరియు నేను అతనితో కలిసి ప్రదర్శన ఇస్తాను. వాట్ ఎ టాలెంట్ ఏ పర్ఫెక్ట్ పిచింగ్. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు. కానీ మనం మనుషులం అందరం కలిసి గర్వించేలా చేద్దాం. అని అన్నారు.
Also Read : Ram Charan : కడప దర్గాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
తమన్ స్పందించడం పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలుపుతూ ” అద్భుతమైన కంఠంతో పాటలు ఆలపిస్తోన్న ఈ అంధ యువకుడికి ఆహా నిర్వహిస్తోన్న తెలుగు ఇండియన్ ఐడల్ లో అవకాశం ఇచ్చేలా చూస్తానని ప్రకటించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవకాశంతో అద్భుతమైన తన టాలెంట్‌కు మరింతగా గుర్తింపు దక్కుతుంది. భవిష్యత్ లో తన మధురమైన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఈ యువకుడు ఉన్నతంగా ఎదుగుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.