Site icon NTV Telugu

Tollywood : ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు విఫలం..షూటింగ్స్ బంద్?

Tollywood

Tollywood

సినిమాలకు పని చేసే వివిధ క్రాఫ్ట్స్ లోని కార్మికుల రోజు వారి వేతనాల పెంపు విషయంలో నిన్న ఫిలిం ఛాంబర్ లో కీలక సమావేశం జరిగింది. ఇంటర్నల్ గా జరిగిన సమావేశంలో నిర్మాతలు ఛాంబర్ సభ్యులు తో ఫెడరేషన్ నాయకుల భేటీ అయ్యారు. వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య ఇరువురు మధ్య వాడివేడిగ చర్చిలు జరిగాయి. కార్మికులకు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాంతో నిబంధనలకు అనుగుణంగా వేతనం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : Sitara Entertainments : కన్నడ స్టార్ హీరోతో సితార నాగవంశీ.. సంచలన చిత్రం

నిన్నజరిగిన సమావేశంలో కార్మికసంఘం ఫెడరేషన్ ప్రతినిధులతో 5% మాత్రమే పెంచుతామని నిర్మాతలు ఛాంబర్ సభ్యులు చెప్పారు. ఇది మాకు సమ్మతం కాదు అని మాకు అనుకూలంగా (30%) పెంచిన వారికే ఆగస్టు ఫస్ట్ నుంచి షూటింగ్ కి హాజరవుతామని ఫెడరేషన్ వారు తేల్చి చెప్పేసారు. దాంతో వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మధ్య చర్చలు విఫలం అయ్యాయి. ఇదే విషయమై ఈ గురువారం మరోసారి చర్చలు జరగనున్నాయి. రేపు ఉదయం 11.30am కి కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో కార్మిక భవన్ లో జరిగే చర్చల్లో సమస్య కొలిక్కి రాకపోతే ఆగస్టు ఫస్ట్ నుంచి సమ్మెకు కార్మిక సంఘాలు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.  ఈ విషయం మీద మరింత క్లారిటీ జూలై 31న రానుంది. తమకు న్యాయంగా రావాల్సిన వేతనాలను దక్కించుకునేందుకు కార్మిక సంఘాలు పట్టుదలగా ఉన్నాయి. మరి ఈ వివాదం ఎలా ముగుస్తోందో చూడాలి.

Exit mobile version