NTV Telugu Site icon

Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు

Swag

Swag

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు బాగున్నాయి అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అంత లేదులే అనిపిస్తాయి. సినిమా చూసినోళ్లు 90% సాటిస్ఫై అయ్యారు. 10% కొంచెం కాంప్లెక్స్ ఉంది అని ఫీల్ అయ్యారని హసిత్ చెప్పాడు. శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు. దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.  ఏమీ లేని నాకు ఇంత గుర్తింపు ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ రుణం తీర్చుకోవాలి. హసిత్ నా ఫ్యాన్. నాకు ఒక తమ్ముడిలా. ఆడియన్స్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి రాస్తే దీన్ని కొట్టేది రాయాలి. రాస్తాడనే నమ్మకం కూడా ఉంది. విశ్వ గారు మాకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి కథను చేయలేం.  సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. ఆ 10% కూడా కంగారు పడకండి. నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేకపోతే లావు అయిపోతాను (నవ్వుతూ) అందరికీ థాంక్యూ’ అన్నారు

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ. శ్వాగ్ ని ఇంత అద్భుతంగా ఆదరించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. సినిమాని చక్కగా ప్రమోట్ చేసిన మీడియాకి థాంక్యూ. నేను టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే శ్రీ విష్ణు ని కమల్ హాసన్ గారితో పోల్చడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాను. ఇంద్రుడు చంద్రుడు, మైఖేల్ మదన్ కామరాజు, భామనే సత్యభామనే సినిమాల్లో కమలహాసన్ గారు చేసింది మనం ఒక్క సినిమాలో చూడచ్చని చెప్పాను. ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. హసిత్ శ్రీ విష్ణు చాలా వర్క్ చేశారు. శ్రీ విష్ణు తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాగే హసిత్ నెక్స్ట్ ఇయర్ మరో మూవీ చేయబోతున్నాం’అన్నారు.

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ..  సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి  ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో మేము ఈ సినిమా గురించి పడిన రెండున్నర ఏళ్ల కష్టాన్ని మర్చిపోయాం. మీడియా, ఆడియన్స్ నుంచి వచ్చిన ఇంత అద్భుతమైన స్పందన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆడియన్స్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన హీరో శ్రీ విష్ణు గారికి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ‘శ్రీ విష్ణు ది గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డెకేడ్’ అనే ప్రశంసలు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గూప్స్ బంప్స్ వస్తున్నాయి’ అని అన్నారు.