కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘వాతి’, ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి సూర్యతో కూడా మంచి కథతో రాబోతున్నాడు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోగా. ఈ మూవీలో సూర్యకి జంటగా మమితా బైజు నటిస్తుండగా, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కూడా నటిస్తున్నారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. దీంతో తాజాగా..
Also Read : Anushka : హీరోయిన్ అనుష్క కొంటె చూపులు.. నగరంలో 40 యాక్సిడెంట్స్..?
సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి, నాగ వంశీ పళని మురుగన్ ఆలయంలో దర్శనం చేసుకున్నారు. సినిమా స్క్రిప్ట్‌తో పళనికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సూర్య కొత్త లుక్ లో కనిపించారు. సినిమాలో కూడా ఇదే లుక్కులో ఉంటారని అనుకుంటున్నారు. ఆలయంలో వెంకీ అట్లూరి, హీరో సూర్య ఇద్దరూ సాంప్రదాయ పద్ధతిలో పంచె కట్టులో కనిపించారు. ఇక సూర్య 46 సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా..ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. అది కూడా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం నిర్మితమవుతోంది. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ మూవీ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
