ప్రముఖ దర్శకుడు మణిరత్నం తొమ్మిది విభాగాలతో ‘నవరస’ వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, బీభత్సం, రౌద్రం, శాంతం వంటి తొమ్మిది విభాగాలకు తొమ్మిది మంది దర్శకులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 9వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘నవరస’ నుంచి దర్శకుడు గౌతమ్ మీనన్ చేస్తున్న ‘గిటార్ కంబి మేలే నిండ్రు’ అనే విభాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశారు. ఇందులో సూర్య సరసన ప్రయాగా మార్టిన్ నటిస్తోంది. పోస్టర్ ప్రత్యేకంగా ఉండటంతో ఆకట్టుకుంటుంది. సూర్యతో పాటుగా మిగితా విభాగాల్లో అరవింద స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, నిత్యా మేనన్, పార్వతి, ఐశ్వర్య రాజేశ్, పూర్ణ, ప్రసన్న, సింహా, గౌతమ్ కార్తిక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం నిర్మిస్తున్న ‘నవరస’ ఆంథాలజీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ జయేంద్ర పంచపకేషన్ భాగస్వామిగా ఉన్నారు.
ఆకట్టుకున్న ‘నవరస’ సూర్య పోస్టర్స్
