NTV Telugu Site icon

Suriya 44 : ‘సూర్య44’ మూవీ క్రేజీ అప్డేట్ వైరల్..

Surya 44

Surya 44

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కంగువ”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అండ్ యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై జ్ఞానవేల్ రాజా , వంశికృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

Read Also :Viswak Sen : అవకాశం వస్తే ఆ సినిమాలో నటించాలని వుంది..

ఇదిలా ఉంటే సూర్య నటిస్తున్న మరో మూవీ ” సూర్య 44 “..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.అలాగే పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు.త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు..ఈ సినిమాలో క్యాస్ట్అండ్ క్రూ గురించి మేకర్స్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజ్‌ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది.