సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. సురేష్ కొండేటి హీరోగా అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‍లైన్ తోనే సినిమా తెరకెక్కింది. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది. . ఈ క్రమంలో సురేష్ కొండేటి పుట్టిన రోజు (అక్టోబర్ 6) సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజ్ అయింది.
ఈ సందర్బంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ” సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ చూడడం జరిగింది. చాలా బాగుంది. ‘అభిమాని’ అనే టైటిల్ చాలా ఆరోగ్యకరంగా, చాలా బాగుంది. ఇక సురేష్ కొండేటి గురించి చెప్పాలంటే, తాను నాకు జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండే తెలుసు. అక్కడి నుండి తన ప్రయాణం జర్నలిస్ట్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా, నటుడిగా, ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగిన తీరు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మంచి విజయం అందించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ అల్ ది బెస్ట్ సురేష్” అన్నారు.
అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ” నేను డైరెక్ట్ చేసిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా విడుదల కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ లో సురేష్ కొండేటి గారు ప్రధాన పాత్రలో నటించారు. యముడిగా అజయ్ ఘోష్ గారు నటించారు, హీరోయిన్‌గా అక్సాఖాన్ నటించారు,
అక్సాఖాన్: ” నేను నటించిన ‘అభిమాని’ మూవీ గ్లింప్స్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా విడుదల కావడం మా టీం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సర్.
సురేష్ కొండేటి మాట్లాడుతూ ” దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది.
పంపిణీ దారుడిగా నా కెరీర్ మొదలైందే రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’తో…
ఆ సినిమా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో నేను పంపిణీ చేశాను. ఘన విజయాన్ని సాధించిన ఆ సినిమా నాకు పంపిణీదారుడిగా బలమైన పునాదిని వేసింది. ఆ తర్వాత నిర్మాతగానూ మారాను. అలా ఫిల్మ్ జర్నలిస్ట్ గా ఉన్న నన్ను సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది రాఘవేంద్రరావు గారే. అలాంటి రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా.. నేను ప్రధాన పాత్ర పోషించిన ‘అభిమాని’ సినిమా గ్లింప్స్ విడుదల కావడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. సో రాఘవేంద్రరావు గారి ఆశీస్సులతో ఈ సినిమా మంచి విజయాన్ని పొందుతుందని, నటుడిగా నేను మరో స్థాయికి చేరుకోవడానికి ఆ విజయం దోహదం చేస్తుందని భావిస్తున్నాను.