Site icon NTV Telugu

Surekha Vani: నేను ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం.. కానీ..!

Surekha Vani

Surekha Vani

Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో పద్దతిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఫుల్‌ డిమాండ్ వున్న క్యారెక్టర్‌ నటిగా.. బ్రహ్మానందంకి జోడీగా వేసి మంచినటిగా గుర్తింపు పొందింది. తన కెరీర్‌ లో భిన్నమైన పాత్రలు ఎన్నో చేసింది. ఇక సురేఖ భర్త మరణం తరువాత కూతురు సుప్రీత తో ఒంటరిగా నివసిస్తోంది. అయితే కొద్దిరోజులు సైలెంట్‌ గా సురేఖా వాణి మళ్లీ జోష్‌ పెంచింది. పబ్బులు, సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. ఫుల్‌ జోష్‌ తో తన కూతిరితో ఓరేంజ్‌ లో ఎంజాయ్‌ చేస్తూ కనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నా ఆమె మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి తన ఎంజాయ్‌ తను చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం రెండో పెళ్లి వ్యవహారం కూడా బయటకు రావడంతో సురేఖ వాణి మళ్లీ ట్రోల్‌ చేశారు నెటిజన్లు.

అయితే దానికి ఆమె భరించే శక్తి ఎవరికి లేదని, తన అవసరాలని తీర్చగలిగే బాయ్‌ ఫ్రెండ్‌ ఉంటే చాలని బోల్డ్‌ కామెంట్స్‌ కూడా చేసింది సురేఖ. సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా తల్లి, పిన్ని పాత్రలో కనిపించే ఆమె బయట మాత్రం ఎంతో హాట్ గా కూతురుతో కలిసి చిల్ అవుతూ కనిపిస్తూ వుండటంతో.. తల్లి కూతుళ్లులా లేరు మీద్దరు ప్రెండ్స్‌ లా వున్నారంటూ ట్రోలో చేస్తుంటే.. మరొకొందరు అమ్మా సురేఖ అవసరమా నీకు ఇదంతా.. పెళ్ళీడుకు వచ్చిన కూతురుని పెట్టుకుని ఈపబ్బులు, రీల్స్‌ ఏంటి నీకు అవసరమా అంటూ ట్రోల్‌ చేశారు. వారందరికి తగిన సమాధానం చెబుతూ సోషల్ మీడియాలో ట్రోల్‌ అవుతూనే వుంది సురేఖ వాణి. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవున్న ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఆమె సోషల్ మీడియాలో ట్రోల్‌ అవుతుండటంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఇప్పుడు సురేఖ వాణి సినిమా ఆఫర్లు తగ్గాయి. గత కొన్నేళ్లుగా ఆమెకు అంతగా సినిమా ఆఫర్లు రావడంలేదు.

ఒక వేళ ఆమె సినిమాలు చేస్తున్నా ఓవోచిన్న చిన్న చిత్రాలలో మాత్రమే కనిపిస్తుంది. ఆమె తాజాగా నటించిన స్వాతిముత్యం సినిమా సక్సెస్‌ మీట్‌ లో సురేఖావాణి హాజరైంది. అనంతరం సురేఖ వాణి మాట్లాడుతూ.. తాను సినిమాలలో నటించడానికి రెడీగా లేనని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అవకాశాలు ఇచ్చే వారు లేరని తన ఆవేదనని వ్యక్తం చేసింది. అవకాశాలు ఇస్తే ఏ రోల్స్ అయినా పర్లేదని చెప్పింది సురేఖ అయితే.. మరి సురేఖావాణి ఆవేదన అర్ధం చేసుకొని ఏవైనా ప్రత్యేక పాత్రలు ఆమెకి ఇస్తారేమో చూద్దాం మరి.
Astrology : అక్టోబర్‌ 08, శనివారం దినఫలాలు

Exit mobile version