విజయవాడ : శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు శ్రీ లీల హీరో హీరోయిన్లు గా పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని విజయ వంతంగా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల వివాదంలో చిక్కుకుంది. శ్రీ లీల తన కూతురే కాదని ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… పెళ్ళిసందడి హీరోయిన్ శ్రీలీల తన కూతురు కాదని..ఆమె తన మాజీ భార్యకు మాత్రమే కూతురని పేర్కొన్నారు. తాము విడిపోయిన తరువాత శ్రీలీల.. నా మాజీ భార్యకు జన్మించిందని…తన ఆస్తులపై క్లైమ్ చేయడానికి నా పేరు వాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్తామని… ఇంకా తమ విడాకులపై కేసులు నడుస్తున్నాయన్నారు. హైకోర్టు నుంచీ సుప్రీంకోర్టు వరకూ వెళ్ళామని.. సూరపనేని సొసైటీకి కూడా కంప్లైంట్ చేసానని తెలిపారు. సన్మాన సభలో ఏ ఆధారంతో తన కుమార్తెగా ప్రకటిస్తారని ఆయన ఫైర్ అయ్యారు.
