తెలుగు ప్రేక్షకుల కోసం బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్ మరోసారి తెరపై మెరవడానికి సిద్ధంగా ఉన్నారు. అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘త్రిముఖ’ చిత్రంలో ఆమె ఓ స్పెషల్ ఐటెం సాంగ్‌లో నటించారు. ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహించగా, డాక్టర్ శ్రీదేవి మద్దాలి, డాక్టర్ రమేష్ మద్దాలి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో “గిప్పా గిప్పా” అనే ఐటెం సాంగ్ ఇటీవలే గ్రాండ్‌గా షూట్ పూర్తయింది. యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతి అగర్వాల్, సాహితీ దాసరి (పొలిమేర ఫేమ్) వంటి పలువురు నటీనటులు ఈ పాటలో పాల్గొన్నారు. ఈ పాటకు భారీ బడ్జెట్ కేటాయించడం తో పాటు, 10 మందికి పైగా సినీ ప్రముఖులు డాన్స్ చేశారు. దీని వల్ల ఈ సాంగ్ ఒక స్టార్ స్టడెడ్‌గా నిలవనుంది.
Also Read :Saiyaara : ‘సైయారా’ కలెక్షన్ల సునామీ..
తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాట, విజువల్ ఆకట్టుకునేలా చిత్రీకరించబడింది. సంగీతం, నృత్యాలు, గ్లామర్ అన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే లక్ష్యంగా ఈ పాట తీర్చిదిద్దారు. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, మూవీ విడుదల తేదీ ఈ నెల చివరిలో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈ చిత్రం త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.
