బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ తన హాట్ షో తో బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి మెప్పించింది .సన్నీ లియోన్ హీరోయిన్ గా నటిస్తూనే పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది..2014లో వచ్చిన “రాగిణి ఎంఎంఎస్ 2” మూవీలో “బేబీ డాల్” అనే పాటలో సన్నిలియోన్ కనిపించగా, ఆ సాంగ్ ఎంతో పాపులర్ అయ్యి సన్నీకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ పాపులారిటీ కారణంగా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.కానీ ఇప్పటికీ సన్నీలియోన్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఐటెం సాంగ్ చేస్తుంది అంటే చాలు ఆ సినిమా బజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ భామకు వున్న భారీ క్రేజ్ కారణంగా బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలలో కూడా ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి .
తెలుగు లో ఈ భామ మంచు మనోజ్ నటించిన కరెంటు తీగ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సన్నీలియోన్ ‘పీఎస్‌వీ గరుడవేగ’ మరియు ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సన్నీలియోన్ ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘షీరో’, ‘కోకా కోలా’ మరియు ‘యుఐ’ వంటి చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా సన్నీలియోన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్.యువన్ దర్శకత్వంలో సన్నీ లియోన్ “మందిర” అనే సినిమా సినిమా చేస్తుంది .ఈ సినిమాను కొమ్మాలపాటి శ్రీధర్ సమ్పర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు .జావేద్ రియాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .తాజాగా ఈ సినిమా నుంచి సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ మారింది .