Site icon NTV Telugu

Sunny Deol : ‘రామాయణ’‌లో తన పాత్ర గురించి.. సన్నీ డియోల్‌ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Sony Diol

Sony Diol

భారతీయ పౌరాణిక గాథ‌ల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన మహాకావ్యం ‘రామాయణం’. ఈ అద్భుత గాథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్‌ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తెరక్కెకుతున్న ఈ పాన్‌వరల్డ్‌ మూవీ 45కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది.  దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఇండియన్ ఆడియెన్స్, ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ భారీ క్రేజ్ నెలకొంది. కాగా ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ న‌టించ‌బోతుండ‌గా.. సాయిప‌ల్లవి సీత పాత్రలో న‌టిస్తుంది. రావ‌ణుడిగా క‌న్నడ స్టార్ హీరో య‌ష్. హ‌నుమంతుడిగా సన్నీ డియోల్, ల‌క్ష్మణుడిగా ర‌వి దూబే త‌దిత‌రులు న‌టించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాలో స‌న్నీడియోల్ త‌న పాత్రకు సంబంధించి తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు .

Also Read : Madhavan : ఈ పద్దతి రజనీకాంత్‌ నుండే నేర్చుకున్న..

‘ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందు‌కు చాలా ఆనందంగా ఉంది. చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా రోల్ చాలా సరదాగా, అల్లరిగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు చాలా సవాళ్లతో కూడుకున్న‌వే అయినా.. పూర్తిగా లీనమై నటించడానికి సిద్ధంగా ఉన్నాను. నా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు మొత్తం టీమ్‌ ఎంతో కష్టపడుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఎలాంటి రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు, రామాయణం లాంటి మహాకావ్యం ఎన్నిసార్లు తెరకెక్కించిన కొత్తదనమే ఉంటుంది, ఈ సినిమాతో ప్రపంచం మరోసారి రామాయణం గొప్పతనాన్ని ఆస్వాదిస్తుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version