NTV Telugu Site icon

‘గల్లీ రౌడీ’ విజయ్ సేతుపతి సినిమాకు కాపీనా ?

Sundeep Kishan’s Gully Rowdy copied from Vijay Sethupathi's Movie?

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అయితే ఈ చిత్ర కథను తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం నుంచి కాపీ కొట్టారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ సేతుపతి నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రం నుంచి ఇన్స్పైర్డ్ అయ్యి ‘గల్లీ రౌడీ’ని తెరకెక్కించారట. దాదాపు ‘గల్లీ రౌడీ’ చిత్రం విజయ్ సేతుపతి చిత్రానికి రీమేక్ అని, అయితే మేకర్స్ మాత్రం ఏ కారణం చేతనో ఈ సినిమాను రీమేక్ గా ప్రచారం చేయడం లేదని అంటున్నారు. ఏప్రిల్ 19న సాయంత్రం 5 గంటలకు ‘రౌడీ కా బాప్’ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘గల్లీ రౌడీ’ టీజర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. టీజర్ విడుదలైతే సినిమా కాపీ అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవివి సత్యనారాయణ నిర్మించారు. పోసాని, వెన్నెల కిషోర్, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలకపాత్రలలో నటిస్తున్నారు. సాయి కార్తీక్, చౌరస్తా రామ్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే 21న ‘గల్లీ రౌడీ’ని విడుదల చేస్తున్నారు. కాగా ఇటీవలే ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రంతో అంచనాలను అందుకోలేకపోయాడు సందీప్.