NTV Telugu Site icon

Sundeep Kishan: తమిళ సినిమాలా.. ఇక చాలు బాబోయ్!

Sundeep Kishan Comments

Sundeep Kishan Comments

Sundeep Kishan Says No More Tamil Movies here after: చోటా కె నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ ప్రస్థానం అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్నేహ గీతం అనే సినిమాతో హీరోగా మారిన ఆయన మొట్టమొదటి హిట్ అందుకుంది మాత్రం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతోనే. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన తమిళంలో కూడా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 9 సినిమాలు చేశారు. ఇప్పుడు ధనుష్ హీరోగా ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాయన్ అనే సినిమాలో ధనుష్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. ఆయన సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. 26వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడాడు.

Indra Re Release: మెగా ఫాన్స్.. పులకించిపోవడానికి రెడీ అవ్వండి!

ఈ సందర్భంగా తాను ఇకమీదట వేరే హీరోల సినిమాలలో క్యారెక్టర్లు చేయాలని కానీ తమిళ సినిమాలు చేయాలని కాని అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. ఒకవేళ అది తమిళ సినిమా చేయాలి అంటే తెలుగులో కూడా రిలీజ్ అయ్యేలా బైలింగ్యువల్ సినిమా మాత్రమే ప్లాన్ చేసుకుంటానని అన్నారు. వాస్తవానికి చాలామంది హీరోలు ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నేను అలా తమిళ సినీ పరిశ్రమకు వెళ్లి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశానని ఆయన అన్నారు. ఇక్కడైతే తనను చోటాకే నాయుడు మేనల్లుడు కాబట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి అంటారు. అందుకే తమిళనాడు వెళ్తే అక్కడ ఈ ప్రభావం ఉండదు కాబట్టి నా సొంతంగా నేను ప్రయత్నం చేసే సినిమాలు చేశానని, అయితే ఇకమీదట ఆ అవకాశం రాదు. నేరుగా తెలుగు సినిమాలే చేయాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

Show comments