NTV Telugu Site icon

Sundeep Kishan: ‘రాయన్’లో సందీప్ ఔటాఫ్ సిలబస్.. ఇప్పుడేం చేస్తాడు?

Sundeep Kishan Comments

Sundeep Kishan Comments

Sundeep Kishan Performance getting Huge Appreciation in Raayan: ధనుష్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే రాయన్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిన్న రిలీజ్ చేశారు. నిజానికి తమిళ ఆడియన్స్ ఇతర భాషల నటీనటులు లేదా టెక్నీషియన్ల వర్క్ ని మెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా రేర్ గా మాత్రమే ఇతర భాషల నటీనటుల టాలెంట్ ని గుర్తించి వారి మీద ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. అందుకే పాన్ ఇండియా సినిమాలు కూడా తమిళనాడులో చాలా తక్కువగా హిట్ అవుతూ ఉంటాయి. కానీ సందీప్ కిషన్ విషయంలో మాత్రం ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. వాస్తవానికి సందీప్ కిషన్ తెలుగు వాడైనా తమిళ సినిమాల్లో కూడా బాగా తెలిసిన వాడే. ఈ ధనుష్ రాయన్ సినిమాలో సందీప్ కిషన్ ధనుష్ సోదరుడి పాత్రలో నటించాడు.

Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి ఫిక్స్?.. క్లారిటీ వచ్చేసింది

అయితే ఒక రకంగా ధనుష్ నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ నటనలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి ధనుష్ తో నటించే సమయంలో సందీప్ కిషన్ కి కూడా నటనకు బాగా స్కోప్ దొరికింది. నిజానికి ఈ సినిమాలో ఎస్ జె సూర్య ఒక రేంజ్ లో నటిస్తాడని ఆశించి థియేటర్లకు వెళ్లిన వాళ్లందరికీ సందీప్ కిషన్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజీ అని చెప్పాలి. ఈ సినిమాలో ధనుష్ దుషార విజయన్ తో కలిసి సందీప్ కిషన్ ఒక రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఒకరకంగా తాను ఇక మీదట తమిళ సినిమాలు చేయను అని చెబుతున్నాడు కానీ ఈ సినిమాలో ఆయన నటన చూసిన తర్వాత కచ్చితంగా తమిళ దర్శకులు సందీప్ కిషన్ కోసం కూడా పాత్రలు రాసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు పెద్ద బడ్జెట్ తో ఆయనని హీరోగా పెట్టి సినిమాలు చేసినా ఆశ్చర్యం అక్కర్లేదు.

Show comments