Sundeep Kishan about his Plans to Establish Canteens for food: తాను నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఫ్రీగా పంచి పెడుతున్నట్లు హీరో సందీప్ కిషన్ వెల్లడించారు. ధనుష్ హీరోగా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న రాయన్ అనే సినిమాలో సందీప్ కిషన్ ధనుష్ తమ్ముడి పాత్రలో నటించాడు. జూలై 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఇటీవల వివాహ భోజనంబు రెస్టారెంట్ లో జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్ గురించి స్పందించాడు. నిజానికి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి తమకు కొన్ని సూచనలు మాత్రమే వచ్చాయని ఈలోపే ఏదో జరిగిపోయింది అంటూ మీడియాలో పెద్ద చర్చ జరిగిందని ఆయన అన్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో తమ రెస్టారెంట్ నిర్వాహకులు చాలా కేర్ తీసుకుంటారని ఆయన అన్నారు.
Raj Tarun: సినిమా షూటింగ్‌లో అస్సలు నాన్ వెజ్జే పెట్టలేదట!
అసలు ఏం జరిగిందనే విషయాన్ని అదే రోజు సాయంత్రం క్లారిటీగా చెప్పామని తర్వాత రోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దీన్ని ధృవీకరించారని అన్నారు. అంతేకాక తాను హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 7 వివాహ భోజనంబు అవుట్లెట్స్ ద్వారా ఒక్కొక్క అవుట్లెట్ నుంచి రోజుకు 50 ఫుడ్ పార్సెల్స్ నిర్భాగ్యులకు అందజేస్తున్నామని అన్నారు. ఒక్కొక్క పార్సిల్కి 50 రూపాయల లెక్క వేసుకున్న నెలకు నాలుగున్నర లక్షల రూపాయల మేర ఫుడ్ తాను తన బిజినెస్ ద్వారా అందజేస్తున్నట్లు సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు అన్న క్యాంటీన్స్ తరహాలో ఏమైనా చేయగలనేమో అనే విషయం మీద కూడా తాను ప్లాన్ చేస్తున్నానని మీకు సాంబార్ అన్నం, గుడ్డు అలాగే పెరుగన్నం లాంటివి చాలా బేసిక్ అనిపించవచ్చు. కానీ అసలు ఏమీ లేని వారికి అవే పంచభక్ష పరమాన్నల్లాగా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ క్యాంటీన్ ఆలోచనని బయటకి చెబుతానని అన్నారు.