దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అది సృష్టిస్తున్న అల్లకల్లోలానికి ఎంతోమంది బలైపోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రిలీఫ్ కోసం సహాయాన్ని అందించడానికి పలు సంస్థలు, పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా భారత్ కరోనా బాధితులను ఆదుకోవడానికి కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ గా భారీ విరాళాన్ని హైరాబాద్ సన్ రైజర్స్ ప్రకటించారు. రూ.30 కోట్ల భారీ విరాళాన్ని అందజేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా నిలిచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మాతృ సంస్థ సన్ టివి నెట్‌వర్క్ రూ.30 కోట్లు విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కోవిడ్-19 రిలీఫ్ కార్యక్రమాల కోసం ఈ నిధులను ఉపయోగించబోతున్నాము. ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్ సరఫరా తదితర కార్యక్రమాలపై ఎన్జిఓ లతో భాగస్వామ్యమవుతాము. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మీడియా ద్వారా అవగాహన కల్పిస్తాము’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సన్ టీవీ వారు.
కోవిడ్-19 రిలీఫ్ కోసం సన్ టీవీ భారీ విరాళం
