NTV Telugu Site icon

లీకైన వెడ్డింగ్ కార్డ్… షాకైన ఆర్జీవీ… క్లారిటీ ఇచ్చిన సుమంత్!

Sumanth Gives Clarity on his Second Marriage News

“అక్కినేని వారి హీరో సుమంత్, మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు!” ఈ వార్త చాలా చోట్ల హల్ చల్ చేసింది. మీడియాలో, సొషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. చివరకు విషయం వర్మగారి దాకా వెళ్లింది. పెళ్లంటే పడని ఆర్జీవీ సారు ఊరుకుంటాడా? సుమంత్ ని ట్యాగ్ చేసి మరీ ‘పెళ్లంటే పెద్ద పెంట’ అంటూ పోస్టింగ్ పెట్టాడు. సుమంత్ కూడా ఇక తప్పదని స్పందించేశాడు! తన తొలి డైరెక్టర్ కూడా ‘వద్దురా సోదరా… పెళ్లంటే నూరేళ్ల మంటరా’ అంటూ పాట పాడేసరికి ‘అబ్బే అలాంటిదేం లేదు’ అన్నాడు ‘ప్రేమకథ’ స్టార్!

Read also : సంక్రాంతి బరిలో “సర్కారు వారి పాట” కూడా..!!

పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ పెళ్లి అంటూ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే కదా… దానిపై రామ్ గోపాల్ వర్మ సహా చాలా మంది స్పందించారు. రాము వద్దని హితవు చెబితే ఇతరులు మాత్రం సుమంత్ కి ‘కంగ్రాచ్యులేషన్స్’ చెప్పారు. కానీ, తాజాగా ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం ‘పెళ్లి వార్తలన్నీ ఉట్టివే’నట! తనకు రెండో పెళ్లి ఉద్దేశం లేనేలేదని తేల్చేశాడు సుమంత్. అయితే, ఆన్ లైన్ లో వైరల్ అయిన ‘సుమంత్ వెడ్స్ పవిత్ర’ వెడ్డింగ్ కార్డ్ సంగతేంటి? అది ఓ సినిమా కోసం డిజైన్ చేసిన పెళ్లి పత్రికనట! ‘ఎలాగో కానీ…’ అది సెట్స్ మీద నుంచీ బయటకు లీకైందని చెప్పాడు హ్యాండ్సమ్ హీరో!

పెళ్లి, విడాకులు వంటి అంశాలతో ప్రస్తుతం సుమంత్ ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన అప్ డేట్ కూడా త్వరలో ఉంటుందని ఆయన తన వీడియోలో అనౌన్స్ చేశాడు. అదే చిత్రానికి సంబంధించిన పెళ్లి పత్రిక రకరకాల పుకార్లు, ప్రకంపనలకు దారి తీసింది!

చాలా మంది నెటిజన్స్ సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోవటం లేదని అర్థమై డిజపాయింట్ అవుతున్నారు. మరోసారి మనువాడితే తప్పులేదని అంటున్నారు. కానీ, కొందరు మాత్రం ‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కూడా అయ్యి ఉండొచ్చ’ని కామెంట్ చేస్తున్నారు. చూడాలి, సుమంత్ నెక్ట్స్ మూవీ అప్ డేట్ ఎప్పుడొస్తుందో మరి!