Site icon NTV Telugu

“పుష్ప” తరువాత రౌడీ హీరోతో సుకుమార్?

Sukumar to Direct Vijay Devarakonda after Pushpa Part-1

గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఊహాగానాలు రాగా.. మేకర్స్ అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం విషయంలో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సుకుమార్ “పుష్ప” అనే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఐకాన్ స్టార్ తో ఈ చిత్రాన్ని పూర్తి చేయగానే విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారట సుకుమార్.

Also Read : “లైగర్” కోసం లెజెండరీ ప్రొఫెషనల్ బాక్సర్ ?

“పుష్ప” రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. “పుష్ప” మొదటి భాగాన్ని పూర్తి చేశాక సుకుమార్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందనేది తాజా సమాచారం. “పుష్ప” రెండవ భాగం స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కావడానికి నెలలు పట్టొచ్చు. అంతేకాకుండా “పుష్ప” మొదటి భాగం పూర్తయ్యాక కొంచెం గ్యాప్ తీసుకుని రెండవ భాగాన్ని విడుదల చేయనున్నారు. ఈలోగా విజయ్ దేవరకొండ చిత్రాన్ని చేయనున్నారట. ఈ మూవీని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌లో కేదార్ సెలగంసెట్టి నిర్మించనున్నారు.

Exit mobile version