NTV Telugu Site icon

Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !!

Game Changer Sukumar Review

Game Changer Sukumar Review

పుష్ప సీక్వెల్ గా రూపొందిన పుష్ప 2 సినిమా సక్సెస్ తర్వాత ప్రస్తుతానికి ఆ సినిమా దర్శకుడు సుకుమార్ బ్రేక్ లో ఉన్నారు. నిజానికి ఆయన ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ సినిమా స్క్రిప్ట్ సిద్ధం అయిపోయి ఉండడంతో ఆయన మరికొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేసే పనిలో ఉన్నారు. అవి తాను కాకపోయినా తన శిష్యులతో అయినా చేయించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయన గత సినిమాలో వరకు చూసుకుంటే ఎక్కువగా మీటింగ్స్ అన్నీ హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్ లో జరిగేవి. ఆయన పేరు మీద రెండు సూట్స్ బుక్ అయి ఉండేవి. అప్పుడప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్ కోసం గోవా కూడా వెళ్లి వస్తూ ఉండేవారు.

Toxic: రాకింగ్ స్టార్.. మళ్ళీ షేక్ చేసే ప్లాన్!!

కానీ పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత మాత్రం ఆయన దుబాయిలో ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలానే ఆయన తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో కూడా కనిపించారు. ఇక తాజాగా దుబాయ్ వచ్చిన రామ్ చరణ్ తేజ సుకుమార్ను కలిసి ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్ లో కూడా పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క నాగచైతన్య కార్తీక్ వర్మ దండు సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా సుకుమార్ చూసినట్లుగా తెలుస్తోంది. నాగచైతన్యతో ఉన్న రిలేషన్ కారణంగా తదుపరి చిత్రం కూడా సూపర్ హిట్ కావాలని ఉద్దేశంతో సదరు దర్శకుడుని పిలిపించుకుని తల మొత్తం విన్నట్లుగా తెలుస్తుంది. తర్వాత దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న సెల్ఫిష్ సినిమాకి సంబంధించిన స్క్రిప్టింగ్ మీద కూడా రీ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సుకుమార్ హైదరాబాద్, గోవా వదిలేసి దుబాయ్ లో క్యాంపు వేయడం హాట్ టాపిక్ అవుతోంది.